suriya: వారం రోజుల పాటు తెలుగులో డబ్బింగ్ చెప్పిన సూర్య!

  • వారం పాటు క‌ష్ట‌ప‌డి డ‌బ్బింగ్ చెప్పిన న‌టుడు
  • చిత్రం పేరు 'గ్యాంగ్'
  • హీరోయిన్ కీర్తి సురేశ్‌

తెలుగులో అత్యంత‌ ప్ర‌జాద‌ర‌ణ ఉన్న త‌మిళ న‌టుల్లో సూర్య ఒక‌రు. ఆయ‌న న‌టించిన ప్ర‌తి సినిమా తెలుగులో కూడా విడుద‌ల‌వుతుంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు సూర్య, త‌న పాత్ర‌కు తెలుగులో డ‌బ్బింగ్ చెప్పుకోలేదు. మొద‌టిసారిగా 'తాన సెరంధా కూటం' చిత్ర తెలుగు వెర్ష‌న్‌కి సూర్య తెలుగులో డ‌బ్బింగ్ చెప్పారు. ఈ చిత్రం 'గ్యాంగ్‌' పేరుతో తెలుగులో విడుద‌లకాబోతుంది. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న కీర్తి సురేశ్ న‌టించింది. సంక్రాంతి పండుగ‌కు ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సాధార‌ణంగా త‌మిళ డ‌బ్బింగ్‌ను సూర్య ఒక‌ట్రెండు రోజుల్లో పూర్తి చేస్తార‌ట‌. కానీ తెలుగు డ‌బ్బింగ్  కోసం దాదాపు వారం రోజుల పాటు సూర్య క‌ష్ట‌ప‌డ్డార‌ట‌. తెలుగు ప‌లికే విధానం బాగా రావ‌డం కోసం చాలా ప్ర‌య‌త్నం చేశార‌ట‌. ఆ ప్ర‌య‌త్నాలు ఎంత‌వ‌రకు ఫ‌లించాయో తెలుసుకోవాలంటే సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. గ‌తంలో 'బ్ర‌ద‌ర్స్' చిత్ర తెలుగు వెర్ష‌న్‌కి కూడా సూర్య డ‌బ్బింగ్ చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించారు. కానీ పూర్తిస్థాయిలో చెప్ప‌లేక‌పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు సూర్య చిత్రాల‌న్నింటికీ శ్రీనివాస‌మూర్తి అనే డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గాత్ర‌దానం చేసేవారు.

More Telugu News