gazal srinivas: గజల్ శ్రీనివాస్‌ను పోలీసు కస్టడీకి ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు!

  • యువ‌తిని వేధించిన కేసులో జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో గ‌జ‌ల్‌ శ్రీనివాస్ 
  • ద‌ర్యాప్తు పురోగ‌తి కోసం కస్ట‌డీ కోరిన‌ పోలీసులు
  • నాలుగు రోజులు విచారిస్తామ‌ని వాద‌న‌
ఆల‌య‌వాణి రేడియోలో ప‌నిచేస్తోన్న ఓ యువ‌తిని లైంగికంగా వేధించిన కేసులో గాయ‌కుడు, ర‌చ‌యిత గ‌జ‌ల్ శ్రీనివాస్ ప్ర‌స్తుతం జ్యుడీషియ‌ల్ కస్ట‌డీలో చంచ‌ల్ గూడ జైలులో వున్న విష‌యం తెలిసిందే. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా నిందితుడిని త‌మ క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని పోలీసులు హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. నాలుగు రోజుల పాటు గ‌జ‌ల్ శ్రీనివాస్‌ని విచారిస్తామ‌ని చెప్పారు. అయితే, ఇరు పక్షాల వాద‌న‌లు విన్న కోర్టు క‌స్ట‌డీ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించింది.    
gazal srinivas
Police
Hyderabad
nampally court

More Telugu News