raghu: త్రివిక్రమ్ మెచ్చుకోవడంతో షాక్ అయ్యాను .. ఆయన మూవీలో ఛాన్స్ కోసం వెయిటింగ్

  • నా నటన ఇష్టమని త్రివిక్రమ్ చెప్పారు 
  • తప్పకుండా చేద్దామని అన్నారు
  • ఆయన మాటలు వింటూ నేను అలాగే ఉండిపోయాను
కామెడీతో కూడిన రౌడీయిజాన్ని పండించడంలో రఘుకి మంచి పేరుంది. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తనకి ఎదురైన ఒక సంఘటనను గురించి చెప్పుకొచ్చారు. " 'జల్సా' సినిమాకి పవన్ డబ్బింగ్ చెబుతున్నారు .. ఆ పక్కనే వున్న థియేటర్లో నేను డబ్బింగ్ చెబుతున్నాను. నేను బయటికి వచ్చిన సమయంలోనే పవన్ బయటికి వచ్చారు. ఆయనని చూసి నేను అక్కడే ఆగిపోయాను. త్రివిక్రమ్ తో మాట్లాడి పవన్ వెళ్లిపోయారు.

 త్రివిక్రమ్ వెనక్కి తిరిగి వస్తుండగా .. పలకరించాలా .. వద్దా అనే సందేహంతో నేను వున్నాను. ఆయనే నన్ను చూసి పలకరించారు .. "మీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం .. 'అతిథి'లో మీరు చేసిన షాట్ నాకు చాలా ఇష్టం .. నేను కిందపడి దొర్లి .. దొర్లి నవ్వాను. మహేశ్ కి కూడా చాలాసార్లు చెప్పాను. ఆ సీన్ చాలా బాగా చేశారు .. తప్పకుండా చేద్దాం' అంటూ ఆయన అభినందిస్తుంటే నేను అలాగే ఉండిపోయా. అప్పటి నుంచి ఆయన సినిమాలో ఛాన్స్ కోసం ట్రై చేస్తూనే వున్నాను' అంటూ చెప్పుకొచ్చారు.
raghu

More Telugu News