adhar: అవ‌న్నీ పుకార్లే.. అంద‌రి ఆధార్ కార్డుల వివరాలు భ‌ద్రంగా ఉన్నాయి: యూఐడీఏఐ ప్ర‌క‌ట‌న‌

  • కొంద‌రు ఆధార్ వివ‌రాలు వాట్స‌ప్ ద్వారా అమ్ముతున్నార‌ని వార్తలు
  • రూ.500 ఇస్తే వాట్సప్ ద్వారా ఎవరి ఆధార్ వివరాలైనా పొందవ‌చ్చ‌ని ప్ర‌చారం
  • ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు-యూఐడీఏఐ
  • ఎటువంటి వివరాలు బయటకు వెళ్లవని హామీ 

కొంద‌రు ఆధార్ వివ‌రాలు వాట్స‌ప్ ద్వారా అమ్ముతున్నార‌ని ద ట్రిబ్యూన్ అనే ఆంగ్ల‌ పత్రిక స్టింగ్ ఆపరేషన్ నిర్వ‌హించి చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. రూ.500 ఇస్తే వాట్సప్ ద్వారా ఎవరి ఆధార్ వివరాలైనా తేలిగ్గా పొందవ‌చ్చ‌ని వ‌స్తోన్న ఆ వార్త దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. దీనిపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) స్పందిస్తూ ఇదంతా పుకారేన‌ని, ఆధార్‌ సమాచారమంతా భద్రంగా ఉందని స్ప‌ష్టం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇటువంటివి సృష్టిస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మొద్దని, ఆధార్‌కి సంబంధించిన ఎటువంటి వివరాలు బయటకు వెళ్లవని హామీ ఇస్తున్నామ‌ని ప్రకటన విడుద‌ల చేసింది.  

More Telugu News