gold prices: అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన బంగారం ధరలు

  • ఔన్స్ ధర 1,308 డాలర్లకు తగ్గుదల
  • లాభాల స్వీకరణే కారణం
  • రెండు రోజుల క్రితమే గరిష్ట స్థాయికి చేరిక

బంగారం ధరలు ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లో లాభాల స్వీకరణ కారణంగా తగ్గాయి. రెండు రోజుల క్రితమే బంగారం మూడున్నర నెలల గరిష్ట స్థాయులను చేరిన విషయం తెలిసిందే. దీంతో ఈ స్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఈ రోజు స్పాట్ బంగారం ఔన్స్ 1,308 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 1,310 డాలర్ల వద్ద ఉంది. గత డిసెంబర్ నెలలో ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన తర్వాత బంగారం ధర అక్కడి నుంచి 85 డాలర్ల మేర లాభపడింది. ఔన్స్ బంగారం 31 గ్రాములకు సమానం.

More Telugu News