ci suspension: వీడియో తీసి.. సీఐకి 'సినిమా' చూపించింది!

  • లైంగిక దాడికి యత్నించిన సీఐ
  • తెలివిగా వీడియో తీసిన బాధితురాలు
  • సీఐ సస్పెన్షన్

మహిళలకు అండగా నిలవాల్సిన ఓ ఖాకీ... యువతిపై లైంగిక దాడికి యత్నించిన ఘటనలో సస్పెన్షన్ కు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే, వారణాసికి చెందిన ఓ యువకుడు విశాఖపట్నంలోని 'ఫోర్ పాయింట్స్' హోటల్ లో పని చేస్తున్నాడు. మలేషియాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న ఓ యువతితో అతను ప్రేమలో పడ్డాడు. ఈ నేపథ్యంలో సదరు యువతి మలేషియా నుంచి వచ్చేసి, కొన్ని నెలల క్రితం అదే హోటల్లో చేరింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ ఆ యువకుడు గత నవంబర్ లో వైజాగ్ నుంచి పరారయ్యాడు. దీంతో, నవంబర్ 18న ఆ యువతి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అనంతరం ఆ యువకుడు పంజాబ్ లోని లుథియానాలో ఉన్నాడని గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లుథియానా కోర్టులో హజరుపరిచి, ఆ తర్వాత విశాఖకు తీసుకొచ్చి, జైలుకు తరలించారు. అయితే, తన ప్రియుడిని జైలుకు పంపితే, ఆ తర్వాత తనను అతను పెళ్లి చేసుకోడేమో అని యువతి భావించింది. ఇదే ఆందోళనను సీఐ వెంకటరావు వద్ద వెలిబుచ్చింది.

 దీన్ని ఆసరాగా తీసుకున్న ఖాకీ కామాంధుడు గత నెల 28న ఆమె ఉంటున్న హోటల్ లో మరో గదికి తీసుకెళ్లి, లైంగిక దాడికి యత్నించాడు. అయితే, ఆయన నిర్వాకాన్ని తెలివిగా వీడియో తీసి గత మంగళవారం పోలీస్ కమిషనర్ కు బాధితురాలు పంపింది. ప్రాథమిక విచారణలో ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో, వెంకటరావును సస్పెండ్ చేశారు. 

  • Loading...

More Telugu News