కమ్ముకున్న పొగమంచు.. చుట్టూ జనాలున్నా ఏమీ కనిపించని వైనం.. యువతిపై అఘాయిత్యం చేసిన కామాంధుడు!
- పొగమంచును అనుకూలంగా చేసుకున్న నిందితుడు
- చండీగఢ్ లో ఘటన
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
చంపుతానని బెదిరించడంతో పాటు, గతంలో ఓ హత్య కూడా చేశానని చెప్పిన సదరు యువకుడి బలం ముందు బాధితురాలు ఏమీ చేయలేకపోయింది. చుట్టూ పొగమంచు కమ్మేసి ఉండటంతో జనాలు తిరుగుతున్నా ఆమెకు సాయం అందలేదని తెలుస్తోంది. ఇక బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఆమెకు వైద్య పరీక్షలు జరిపించగా, అత్యాచారం జరిగినట్టు నివేదిక వెల్లడైంది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.