trivikram: వెంకీతో త్రివిక్రమ్ చేయనున్నది బాలీవుడ్ మూవీ రీమేక్?

  • వెంకటేశ్ తో త్రివిక్రమ్ మూవీ 
  • బాలీవుడ్ రీమేక్ అంటూ టాక్ 
  • గతంలో హిట్స్ కొట్టిన కాంబినేషన్  

ప్రస్తుతం త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనిలో వున్నాడు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తరువాత ఆయన ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా మరో వైపున చకచకా జరిగిపోతున్నాయి.

ఈ సినిమా తరువాత వెంకటేశ్ తో త్రివిక్రమ్ ఒక ప్రాజెక్టు చేయనున్నాడు. వెంకటేశ్ పుట్టిన రోజున హారిక హాసిని సంస్థ వారు ఈ విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది బాలీవుడ్ మూవీ 'జాలీ ఎల్.ఎల్.బి.కి రీమేక్ అని సమాచారం. బాలీవుడ్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అందుకే ఈ మూవీ రీమేక్ హక్కులను హారిక హాసిని బ్యానర్ వారు తీసుకున్నారట. ఈ సినిమా రీమేక్ నే వెంకటేష్ తో త్రివిక్రమ్ చేయనున్నాడని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 

More Telugu News