rs. 10 note: కొత్త రూ. 10 నోటు రాబోతోంది.. ఏ కలర్ లో ఉంటుందో తెలుసా?

  • గాంధీ సిరీస్ లో భాగంగా కొత్త నోట్లు
  • చాకొలెట్ బ్రౌన్ కలర్
  • ఓ వైపు కోణార్క్ సూర్య దేవాలయం

కొత్త రూ. 10 నోట్లను రిజర్వ్ బ్యాంక్ జారీ చేయబోతోంది. గాంధీ సిరీస్ లో రాబోతున్న ఈ నోట్లు... చాకోలెట్ బ్రౌన్ కలర్ లో ఉండబోతోంది. ఈ నోటుపై ఓ వైపు కోణార్క్ సూర్య దేవాలయం ఉండబోతోంది. ఇప్పటికే 100 కోట్ల పీసులను ప్రింట్ చేసినట్టు అధికారులు తెలిపారు. 2015లోనే ఈ నోటు డిజైన్ ను రూపొందించింది. గత వారంలో ఈ డిజైన్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నకిలీ నోట్లను అరికట్టే క్రమంలో, తక్కువ డినామినేషన్ నోట్లను ప్రవేశపెడుతోంది. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం... ఆ తర్వాత చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచి కొత్త నోట్లను ప్రవేశపెడుతూ వస్తోంది. 

More Telugu News