Nara Bhuvaneshwari: మేడమ్ శనివారమూ రండి... చంద్రబాబు సతీమణికి వింత అనుభవం!

  • ప్రస్తుతం ఆదివారం మాత్రమే అమరావతిలో ఉంటున్న భువనేశ్వరి
  • శనివారమూ రావాలని వేడుకున్న ఉన్నతాధికారులు
  • కనీసం రెండు రోజులు సమయానికి డిన్నర్ చేయాలని ఉందన్న ఐఏఎస్ లు

ఏపీ సీఎం సతీమణి నారా భువనేశ్వరి, ఐఏఎస్ అధికారులతో ఓ విందులో పాల్గొన్న వేళ, ఆమెకు వింత అనుభవం ఎదురైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న ఆమె, ప్రతి ఆదివారం మాత్రమే, భర్త దగ్గరకు వస్తున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు భువనేశ్వరి వద్ద ప్రస్తావిస్తూ, ఓ విన్నపాన్ని ఉంచారు.

"మేడమ్ నిత్యమూ సమీక్షలు, సమావేశాలు అని సీఎం చాలా బిజీగా ఉంటున్నారు. మీరేమో ఆదివారం మాత్రమే వస్తున్నారు. ఆ ఒక్కరోజే ఆయనకు కాస్తంత విశ్రాంతి దొరుకుతోంది. మీరు శనివారమే అమరావతికి వస్తే, ఆయనకు కొంత ఉపశమనం ఉంటుంది. మీరు అలా చేస్తే, మేము కనీసం రెండు రోజులైనా సమయానికి ఇంట్లో కుటుంబీకులతో కలసి డిన్నర్ చేయగలుగుతాం" అని వేడుకున్నారట.

ఆదివారం తనకు విశ్రాంతేకదా అన్న ఆలోచనలో శనివారం రాత్రి పొద్దుపోయేవరకూ చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తున్నారని, అది తమకు కాస్తంత ఇబ్బందిగా ఉందని వారు చెప్పారట. ఈ విషయంలో భువనేశ్వరి ఏం సమాధానం చెప్పారో మరి!

  • Loading...

More Telugu News