uma maheshwar rao: ఏపీ మంత్రి దేవినేనితో ఫోన్‌లో మాట్లాడిన తెలంగాణ మంత్రి హరీశ్ రావు

  • నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌ అంశాల‌పై చ‌ర్చ‌
  • తుంగ‌భ‌ద్ర నుంచి రాజోలిబండ నీటి మ‌ళ్లింపు ప‌థ‌కంపై ముచ్చ‌ట‌
  • కేసీ కెనాల్ ఆయ‌క‌ట్టుకు నీటి విడుద‌ల‌పై కూడా చ‌ర్చ‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుతో తెలంగాణ భారీ నీటి పారుద‌ల శాఖ‌ మంత్రి హ‌రీశ్ రావు ఫోన్‌లో మాట్లాడారు. ప‌లు నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌ అంశాల‌పై చ‌ర్చించారు. తుంగ‌భ‌ద్ర నుంచి రాజోలిబండ నీటి మ‌ళ్లింపు ప‌థ‌కంపై ఇరువురు మంత్రులు మాట్లాడుకున్నారు. కేసీ కెనాల్ ఆయ‌క‌ట్టుకు నీటి విడుద‌ల‌పై కూడా చ‌ర్చించారు. అవ‌స‌ర‌మ‌యితే నీటి వివ‌రాల‌ను క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి కూడా ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇద్ద‌రు మంత్రుల చ‌ర్చ‌పై పూర్తి వివ‌రాలు అందాల్సి ఉంది. 
uma maheshwar rao
Harish Rao
Andhra Pradesh
Telangana

More Telugu News