sikhar dhawan: తొలి టెస్ట్ కు ధావన్ రెడీ.. జడేజా డౌటే!

  • గాయం నుంచి కోలుకున్న ధావన్
  • వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న జడేజా
  • తొలి టెస్ట్ కు దూరమయ్యే అవకాశం
గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ లో జరగనున్న తొలి టెస్ట్ కు ఓపెనర్ శిఖర్ ధావన్ అందుబాటులోకి వచ్చాడు. కేప్ టౌన్ కు బయల్దేరే ముందు ధావన్ కాలికి స్వల్ప గాయమైందని.. అయితే, ఆయన పూర్తిగా కోలుకున్నాడని, తొలి టెస్ట్ కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది.

మరోవైపు, ఈ మ్యాచ్ కు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దూరమయ్యే అవకాశం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న అతను గత రెండు రోజులుగా చికిత్స తీసుకుంటున్నాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ పరిశీలనలో ప్రస్తుతం జడేజా ఉన్నాడు. అతను కోలుకునేందుకు మరో 48 గంటలు పడుతుందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో, తొలి టెస్ట్ కు జడేజా దూరం అయ్యే అవకాశం ఉంది.
sikhar dhawan
Ravindra Jadeja
ream india

More Telugu News