chada venkat reddy: పవన్ కల్యాణ్‌పై మండిపడ్డ చాడ వెంకట్ రెడ్డి

  • తెలంగాణ ఉద్యమంలో పవన్ క‌ల్యాణ్‌ పాల్గొనలేదు
  • ప్రజల కష్టాలు ఆయనకు తెలియవు
  • గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు
  • జనసేన పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది
సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరుపై తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో పవన్ క‌ల్యాణ్‌ పాల్గొనలేదని, ప్రజల కష్టాలు ఏమిటో పవన్ కు తెలియదని వ్యాఖ్యానించారు.

జనసేన పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని, పవన్ గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా తెలంగాణ ప్రభుత్వ నేతలు నిరంతర విద్యుత్ అందిస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదమేనని అన్నారు. చత్తీస్ గడ్ నుంచి ఒక్కో యూనిట్ రూ.5 చొప్పున కొంటూ రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ నెలకు రెండు వేల కోట్ల అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు.   
chada venkat reddy
Pawan Kalyan
janaseana

More Telugu News