Rajinikanth: రజనీ వెంట నడుస్తా.. క్రియేటివ్ హెడ్ పోస్ట్ కు గుడ్ బై చెప్పా: రాజ్ మహాలింగం
- రజనీకాంత్ స్థాపించే రాజకీయపార్టీలో చేరతా
- రజనీ నిజాయతీ, చిత్తశుద్ది, అంకితభావం నన్ను ఆకర్షించాయి
- అందుకే, ఆయన వెంట వెళుతున్నా: ట్వీట్ లో రాజ్ మహాలింగం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో ఆయన అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు. రాజకీయాల్లోకి వస్తున్న రజనీ వెన్నంటి ఉంటామని, ఆయనకు అండగా నిలుస్తామని అభిమానులు అంటున్నారు. తాజాగా, లైకా ప్రొడక్షన్స్ లో క్రియేటివ్ హెడ్ గా పని చేసే రాజ్ మహాలింగం కూడా రజనీ వెంట నడవనున్నారు.
లైకా ప్రొడక్షన్స్ లో తన పోస్ట్ కు రాజీనామా చేశానని, రజనీ వెంట నడుస్తానని రాజ్ మహాలింగం తన ట్వీట్ లో పేర్కొన్నారు. ‘2.0’ సినిమా నిర్మాణ సమయంలో రజనీకాంత్ ను చాలా దగ్గరగా చూశానని, ఆయన నిజాయతీ, చిత్తశుద్ది, అంకితభావం తనను ఎంతగానో ఆకర్షించాయని, అందుకే, రజనీకాంత్ స్థాపించబోయే రాజకీయపార్టీలో చేరుతున్నానని అన్నారు.