dangal: చైనాలో 'దంగ‌ల్' చిత్రం రికార్డు... చైనీస్ ఐఎండీబీలో మొద‌టి స్థానం

  • ఈ రికార్డు సృష్టించిన మొద‌టి విదేశీ చిత్రం
  • ఇత‌ర దేశాల్లో కూడా బాగా ఆడిన దంగ‌ల్‌
  • ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 2000 కోట్ల‌కు పైగా వ‌సూలు

ఆమిర్ ఖాన్ 'దంగ‌ల్‌' చిత్రం చైనాలో స‌రికొత్త రికార్డును సృష్టించింది. చైనీస్ ఐఎండీబీలో ఈ చిత్రం మొద‌టి స్థానంలో నిలిచింది. ఆ వెబ్‌సైట్ నిర్వ‌హించిన స‌ర్వేలో ఎక్కువ మంది 'దంగ‌ల్' చిత్రానికే ఓటు వేసి ఈ రికార్డు సాధించేలా చేశారు. చైనాలో ఇలాంటి రికార్డు సాధించిన మొద‌టి విదేశీ చిత్రం 'దంగ‌ల్‌' కావ‌డం విశేషం. అంతేకాకుండా దేశీయ వ‌సూళ్ల‌లో కూడా దంగ‌ల్ రికార్డులు సృష్టించిన సంగ‌తి తెలిసిందే.

కేవ‌లం భార‌త్‌, చైనాల్లోనే కాదు.. అమెరికా, కెన‌డా, లండ‌న్‌, ఆస్ట్రేలియా, దుబాయ్‌, తైవాన్ వంటి దేశాల్లోనూ దంగ‌ల్ చిత్రం బాగానే వ‌సూళ్లు రాబ‌ట్టింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 2000 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది. నితేశ్ తివారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం 2016, డిసెంబ‌ర్ 23న విడుద‌లైంది.

More Telugu News