amala paul: అధర చుంబనాలపై బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చిన అమలాపాల్

  • ఇలాంటి సీన్లకు నేను రెడీ
  • సన్నివేశం పండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా
  • ఈ సన్నివేశాల్లో లిప్ స్టిక్ వాడటం బాగోదు
వివాదాస్పద స్టేట్ మెంట్లతో ఇటీవలి కాలంలో హీరోయిన్ అమలాపాల్ పతాక శీర్షికల్లో నిలుస్తోంది. కొన్ని రోజుల క్రితం తన నడుముపై ఆమె చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. అధర చుంబనాల సన్నివేశాలను పండించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పింది. అయితే, ఈ సన్నివేశాల్లో లిప్ స్టిక్ వాడటం బాగోదని... అలాంటి సన్నివేశాల్లో తానైతే లిప్ స్టిక్ వాడనని తెలిపింది. ఓ మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు కామెంట్ చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
amala paul
Tollywood
kollywood

More Telugu News