saudi arabia: 35 ఏళ్ల తర్వాత సౌదీలో సినిమాలు.. తొలి భారతీయ చిత్రం రజనీదే!

  • 1980లలో థియేటర్లను మూసేసిన సౌదీ
  • ప్రస్తుతం ఒక్క థియేటర్ మాత్రమే ఉంది
  • ఇప్పుడు మళ్లీ థియేటర్ల ప్రాంరంభం

ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియాలో 1980లలో పెద్ద ఎత్తున ఇస్లామిక్ పునరుద్ధరణ జరిగింది. ఇందులో భాగంగా సినిమాలు మత సిద్ధాంతాలకు విరుద్ధం అంటూ అక్కడి సినిమా థియేటర్లను మూసేశారు. ప్రస్తుతం అక్కడ కేవలం ఒక్క సినిమా థియేటర్ మాత్రమే ఉంది. ఖోబార్ లో ఓ ఐమాక్స్ థియేటర్ ఉంది. అందులో కూడా కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ డాక్యుమెంటరీలను మాత్రమే ప్రదర్శిస్తారు.

ఈ నేపథ్యంలో, దాదాపు 35 ఏళ్ల తర్వాత థియేటర్లను మళ్లీ ప్రారంభించేందుకు సౌదీ కార్యాచరణ మొదలుపెట్టింది. మార్చిలో తొలి థియేటర్ ప్రారంభం కానుందని సౌదీ మంత్రి ఒకరు చెప్పారు. అక్కడ థియేటర్లు ప్రారంభమయిన తర్వాత విడుదలయ్యే తొలి సినిమా ఇండియాదే కావడం గమనార్హం. అది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన '2.0' కావడం విశేషం.

More Telugu News