nataraj: ఎన్టీ రామారావు వ్యక్తిగత కార్యదర్శి నటరాజ్ మృతి

  • అనారోగ్యంతో మృతి
  • ఆయనది చిత్తూరు జిల్లా బి.కొత్తకోట
  • నివాళి అర్పించిన టీడీపీ నేతలు
మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసేన నటరాజ్ (54) అనారోగ్యంతో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయనది చిత్తూరు జిల్లా బి.కొత్తకోట. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన ఎన్టీఆర్ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత మరో ఇద్దరు మంత్రుల వద్ద కూడా కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహించారు. ఆయన మృతి పట్ల తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మలతో పాటు పలువురు టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, నటరాజ్ కుటుంబాన్ని టీడీపీ ఆదుకుంటుందని చెప్పారు.
nataraj
ntr pa

More Telugu News