JubliHills: హైటెక్ సిటీ సమీపంలో తీరిన ట్రాఫిక్ కష్టాలు!

  • అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ ప్రారంభం
  • జాతికి అంకితం చేసిన కేటీఆర్, నాయిని
  • జూబ్లీహిల్స్ నుంచి ఒక్క సిగ్నల్ దాటి కొండాపూర్ కు చేరే అవకాశం

హైదరాబాద్ పరిధిలో పగలనకా, రాత్రనకా బిజీగా ఉండే హైటెక్ సిటీ సమీపంలో ట్రాఫిక్ కష్టాలిక తీరనున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కొండాపూర్, శేరిలింగంపల్లి, హైటెక్స్ తదితర ప్రాంతాలకు వెళ్లాలని భావించే వారు ఇకపై మాదాపూర్ రహదారిలో గంటల కొద్దీ ట్రాఫిక్ లో ఆగి నరకం చూడాల్సిన అవసరం ఉండదు. అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్ రోడ్ నుంచి శిల్పారామం అవతల వరకూ నిర్మించిన అండర్ పాస్ ఈ ఉదయం జాతికి అంకితమైంది.

నేడు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు ఈ అండర్ పాస్ ను ప్రారంభించారు. ఈ మార్గాన్ని వాడటం ద్వారా, జూబ్లీహిల్స్ నుంచి కేవలం ఒకే ఒక్క సిగ్నల్ దాటి, కొండాపూర్ రోడ్డులోకి చేరుకోవచ్చు. ప్రస్తుతం మాదాపూర్ మీదుగా వెళుతుంటే, హైటెక్ సిటీ, మాదాపూర్ పీఎస్ తదితర ప్రాంతాల్లో సహనాన్ని పరీక్షించేంతగా వెయిట్ చేయించే సిగ్నల్స్ ను దాటాల్సి వుంటుంది. ఈ అండర్ పాస్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ కష్టాలు కొంత మేరకు తీరనున్నాయి.

More Telugu News