vakkantham vamsi: వక్కంతం వంశీకి మెసేజ్ పెట్టిన ఎన్టీఆర్

  • 'నా పేరు సూర్య' ఫస్టు ఇంపాక్ట్ చూసిన ఎన్టీఆర్ 
  • చాలా బాగుందంటూ అభినందనలు 
  • వక్కంతం .. ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ అయ్యే ఛాన్స్

ఎన్టీఆర్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ కథను రెడీ చేసిన వక్కంతం వంశీ, ఆ ప్రాజెక్టు ద్వారా దర్శకుడిగా పరిచయం కావాలనుకున్నాడు. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో, బన్నీతో సినిమాను మొదలుపెట్టేశాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి వినిపించిన కథను బన్నీతో చేస్తున్నాడనే ప్రచారం జరిగింది.

ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసిన కథ అలాగే ఉందనీ, ఈ కథ బన్నీ కోసం ప్రత్యేకంగా తయారు చేసిందని ఈ మధ్య వక్కంతం వంశీ క్లారిటీ ఇచ్చాడు కూడా. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన ' నా పేరు సూర్య' నుంచి ఫస్టు ఇంపాక్ట్ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఫస్టు ఇంపాక్ట్ చూసిన ఎన్టీఆర్, వక్కంతం వంశీని అభినందిస్తూ మెసేజ్ పెట్టాడట. ఫస్టు ఇంపాక్ట్ చాలా బాగుంది .. బన్నీ  బాగా చేశాడంటూ ప్రశంసించాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో వక్కంతం వంశీ .. ఎన్టీఆర్ కాంబినేషన్ కూడా సెట్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.    

More Telugu News