chacolate: మరో 40 ఏళ్లలో మాయం కానున్న చాక్లెట్లు?

  • కాకావో మొక్కల నుంచి చాక్లెట్ల ముడిపదార్థం
  • పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు
  • కకావో మొక్కలపై తీవ్ర ప్రభావం
చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు అందరికీ ప్రీతిపాత్రమైనవి చాక్లెట్లు. అలాంటి చాకెట్లు ఓ 40 ఏళ్ల తర్వాత కనిపించకపోవచ్చని ఓ తాజా అధ్యయనం తెలిపింది. వివరాల్లోకి వెళ్తే, చాక్లెట్ల తయారీకి అవసరమైన ముడి పదార్థం కకావో అనే మొక్కల నుంచి లభిస్తుంది. వర్షపాతం, ఉష్ట్రోగ్రత, తడి స్థిరంగా ఉండే ప్రాంతాల్లోనే ఈ మొక్కలు పెరుగుతాయి. అయితే, నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా 2050 నాటికి కకావో మొక్కలు పెరగడానికి అవసరమైన పరిస్థితులు క్షీణిస్తాయని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

ఈ పరిస్థితిని అధిగమించేందుకు... వాతావరణ పరిస్థితిని అధిగమించేలా కకావో మొక్కల్లో జన్యుపరమైన మార్పులు తీసుకొచ్చే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. చాక్లెట్లకు అవసరమైన ముడిపదార్థం సగానికి పైగా పశ్చిమాఫ్రికాలోని ఘనా, ఐవరీకోస్ట్ దేశాల నుంచి వస్తోంది.
chacolate
kakavo plants

More Telugu News