delhi: ఢిల్లీలో విజృంభించిన పొగ‌మంచు... విమానాలు, రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం

  • ర‌ద్ద‌యిన 21 రైళ్లు
  • ఆల‌స్యంగా న‌డుస్తున్న 59 రైళ్లు, 8 విమానాలు
  • ఉత్త‌ర భార‌తంలో చాలా చోట్ల ఇదే ప‌రిస్థితి

దేశ రాజ‌ధాని ఢిల్లీని ద‌ట్ట‌మైన పొగ‌మంచు క‌ప్పేసింది. దీంతో విమానాలు, రైళ్ల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లుగుతోంది. ఈ పొగ‌మంచు కార‌ణంగా ఇప్ప‌టికే 21 రైళ్లు ర‌ద్ద‌వ‌గా, దాదాపు 59 రైళ్లు, 8 విమానాలు ఆల‌స్యంగా న‌డుస్తోంది. అంతేకాకుండా చాలా విమానాల రాక‌పోక‌లు వాయిదా ప‌డ్డాయి. గ‌త వారం రోజుల నుంచి ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంది.

ప‌రిస్థితిని అంచ‌నా వేసి, దీనిపై చ‌ర్య తీసుకునేందుకు తాము ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం నిన్న వెల్ల‌డించింది. ప్ర‌యాణికులకు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఉండేందుకు తాము అన్ని రకాల చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు విమానయాన సంస్థలు తెలిపాయి. దాదాపు ఉత్త‌ర భార‌తదేశంలోని చాలా విమానాశ్ర‌యాల్లో ఇదే పరిస్థితి క‌నిపిస్తోంది. పొగ‌మంచు ద‌ట్టంగా ఉండ‌టం వ‌ల్ల ర‌న్‌వే నుంచి టేకాఫ్ అవ‌డం, ల్యాండ్ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

More Telugu News