Agnatawasi: 'అజ్ఞాత‌వాసి'నా సినిమా కాపీయేమో చూసేందుకు టికెట్ కొంటా: 'లార్గో వించ్' దర్శకుడు

  • ట్వీట్ చేసిన జెరోమ్ సాల్లీ
  • ఫ్రాన్స్ చిత్రం 'లార్గో వించ్' దర్శకుడు జెరోమ్
  • ఇప్పటికే లీగల్ నోటీసులు పంపిన టీ-సిరీస్

మరో వారంలో విడుదల కానున్న పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' చిత్రం ఫ్రెంచ్ చిత్రం 'లార్గోవించ్'కి రీమేక్ అని వార్తలు వస్తున్న వేళ, ఆ చిత్ర దర్శకుడు జెరోమ్ సాల్లీ స్పందించారు. "నేను ఆ సినిమాకు ఓ టికెట్ కొనుక్కోవాలని అనుకుంటున్నాను (అంతకన్నా ముందు విమానం టికెట్)" అని జెరోమ్ ట్వీట్ చేశారు. ఇక లార్గో వించ్ రీమేక్ హక్కులను కలిగివున్న టీ-సిరీస్, 'అజ్ఞాతవాసి' నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపినట్టు పత్రికల కథనాల్లో చూసి తెలుసుకున్న జెరోమ్, ఈ మేరకు ట్వీట్ చేశారు. 'అజ్ఞాతవాసి' సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి అది 'లార్గో వించ్' రీమేక్ అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News