Chandrababu: చిత్రగుప్తుని చిట్టా రాస్తున్నా... అందరినీ దారిలో పెడతా!: చంద్రబాబు హెచ్చరిక!

  • ఎవరు ఏం తప్పులు చేస్తున్నారో తెలుసు
  • కొంత మంది మారారు, చాలా మంది మారాల్సి వుంది
  • ఎలా పనిచేయించుకోవాలో తనకు తెలుసునన్న చంద్రబాబు
ఎవరు ఏం తప్పులు చేస్తున్నారో తనకు తెలుసునని, వారందరి తప్పులనూ తాను చిత్రగుప్తుడి లెక్కలాగా చిట్టా రాస్తున్నానని చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పటికే పలువురు అధికారులు తమ పనితీరును మార్చుకున్నారని కితాబిచ్చిన ఆయన, కొందరిని మాత్రం తాను మార్చలేకపోతున్నానని అన్నారు.

 ప్రకాశం జిల్లా దర్శిలో మలివిడత జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆయన, కొందరు రాజకీయ నాయకులూ మారేందుకు ఆసక్తిని చూపడం లేదని అన్నారు. వారిని ఏ విధంగా దారికి తీసుకురావాలో, వారిని ఎలా మార్చి పని చేయించాలో తనకు తెలుసునని అన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజాబలం ఉందని, ఏ సమస్యపై అయినా, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే, వాటి పరిష్కార బాధ్యత తనదేనని చెప్పారు.

 అధికారుల వెంటబడి మరీ పని చేయిస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇకపై అన్ని కార్యాలయాల్లోనూ కంప్యూటర్‌ ద్వారా పనులు సాగుతాయని, దీనివల్ల పరిపాలనలో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు.
Chandrababu
Andhra Pradesh
Prakasam
Janmabhoomi

More Telugu News