manda krishna madiga: రహదారులను దిగ్బంధిస్తాం.. మరోసారి అరెస్టైన మంద కృష్ణ మాదిగ హెచ్చరిక!

  • పార్శీగుట్టలో మంద కృష్ణ ఉపవాస దీక్ష.. రిమాండుకు తరలించిన పోలీసులు
  • మేము చేస్తోన్న పోరాటానికి సీఎం కేసీఆర్ మద్దతు తెలపాలి
  • ఎక్కడ ఉన్నా 48 గంటలు దీక్ష కొనసాగిస్తా
  • రేపు గ్రామ, మండల కార్యాలయాల ఎదుట నిరసన దీక్షలు

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేద‌ని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ నెల 4 వరకు గడువు ఇస్తున్నామ‌ని, బిల్లు పెట్టకుంటే ఈ నెల 5న బీజేపీ కార్యాలయాల వద్ద నిరసనలు తెలుపుతామ‌ని ప్ర‌క‌టించారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఈ రోజు పార్శీగుట్టలో ఉపవాస దీక్ష ప్రారంభించ‌డంతో అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు... అనుమతి లేకుండా ఉపవాస దీక్షకు దిగార‌ని ఆయనను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

ఈ సంద‌ర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ...  24 సంవత్సరాల నుంచి ఓపికతో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నామని అన్నారు. తాము చేస్తోన్న పోరాటానికి సీఎం కేసీఆర్‌ మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. తాను ఎక్కడ ఉన్నా 48 గంటలు దీక్ష కొనసాగిస్తాన‌ని అన్నారు. రేపు గ్రామ, మండల కార్యాలయాల ఎదుట నిరసన దీక్షలు జ‌ర‌పాల‌ని పిలుపునిచ్చారు.

ఎల్లుండి రహదారుల దిగ్బంధం చేస్తామ‌ని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై పార్లమెంటులో కాంగ్రెస్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులను అరికట్టాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతిస్తున్న‌ట్లు తెలుపుతోన్న బీజేపీ, పార్లమెంటులో మాత్రం బిల్లు ప్రవేశపెట్టడం లేదని అన్నారు. 

More Telugu News