rajyasabha: సజావుగా సాగిన రాజ్యసభ... చరిత్ర సృష్టించిందన్న చైర్మన్
- సభ్యుల సహకారం బాగుందని వ్యాఖ్య
- భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్ష
- ప్రణాళిక ప్రకారం చర్చలు
చాలా రోజుల తర్వాత రాజ్యసభ ప్రణాళిక ప్రకారం జరిగింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా జీరో అవర్, క్వశ్చన్ అవర్, ఇతర అజెండాలు కొనసాగడంతో రాజ్యసభ చరిత్ర సృష్టించిందని చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. వెంకయ్యనాయుడు ఆ మాటలు చెప్పగానే సభ్యులు బల్లలు చరుస్తూ సమ్మతి వ్యక్తం చేశారు. సభ ఇలా సాగడానికి సభ్యుల సహకారమే కారణమని వెంకయ్య అన్నారు.
భవిష్యత్తులో కూడా సభ ఇలాగే సజావుగా జరగాలని ఆకాంక్షించారు. ఇవాళ సభలో మొత్తం పది ప్రశ్నలను చర్చించారు. జీరో అవర్ సబ్‌మిసన్‌తో పాటు మాజీ సభ్యుడు మరగబందు మృతి పట్ల నివాళి అర్పించారు. గత కొన్ని రోజులుగా వివిధ కారణాల వల్ల సభ వాయిదా పడటమో, చర్చలు సరిగా జరగకపోతుండటమో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.