gazal srinivas: వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్‌కు ఈ నెల 12 వరకు జ్యుడిషియల్ రిమాండ్

  • నిందితుడిని నాంప‌ల్లి కోర్టులో ప్ర‌వేశ‌పెట్టిన పోలీసులు
  • యువ‌తిని వేధించాడని బలమైన ఆధారాలు
  • బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన గజల్ శ్రీనివాస్

ఓ యువ‌తిని వేధించిన కేసులో ప్రముఖ గజల్ కళాకారుడు 'గజల్' శ్రీనివాస్‌పై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన విష‌యం తెలిసిందే. కాసేపటి క్రితం ఆయ‌న‌ను పోలీసులు నాంప‌ల్లి కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. దీంతో కోర్టు ఈ నెల 12 వరకు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు గజల్ శ్రీనివాస్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరి కాసేపట్లో కోర్టులో వాదనలు జరగనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News