amazon india: అమెజాన్ ఇండియాలో అమ్మ‌కానికి సిద్ధంగా ఉన్న జియో ఫీచ‌ర్‌ఫోన్‌

  • ధ‌ర రూ. 1,745
  • కొనాలా? వ‌ద్దా? అనే సందిగ్ధంలో వినియోగ‌దారులు
  • అధికారిక అమ్మకాల్లో కొన‌డ‌మే ఉత్త‌మం

ప్ర‌తి ఒక్క‌రికి ఇంట‌ర్నెట్ స‌దుపాయం అందించే ల‌క్ష్యంతో రిలయ‌న్స్ జియో ప్ర‌తిష్టాత్మ‌కంగా విడుద‌ల చేసిన జియో ఫీచ‌ర్ ఫోన్ విప‌రీత ఆద‌ర‌ణ పొందిన సంగ‌తి తెలిసిందే. రూ. 1500ల రిఫండ‌బుల్ డిపాజిట్‌ తో ఈ ఫోన్ ద‌క్కించుకునేందుకు జ‌నాలు ఎగ‌బ‌డ్డారు. ఇందుకోసం విడుద‌ల‌కు ముందే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్ర‌క్రియ‌ను జియో అమ‌లు చేసింది. ఆ త‌ర్వాత కొన్ని ఆఫ్‌లైన్ స్టోర్ల‌లో కూడా అమ్మ‌కాల‌ను మొద‌లుపెట్టింది. కానీ ప్రైవేట్ ఆన్‌లైన్ స్టోర్ల‌కు జియో ఫీచ‌ర్‌ఫోన్ అమ్మ‌కాల‌ను జియో ఇవ్వ‌లేదు.

కానీ ప్ర‌స్తుతం అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో జియో ఫీచ‌ర్‌ఫోన్ అమ్మ‌కానికి సిద్ధంగా ఉంది. గ్యాడ్జెట్ గీక్ బిజినెస్ సొల్యూష‌న్ అనే సంస్థ ఈ అమ్మ‌కాల‌ను చేప‌డుతోంది. దీని ధ‌ర రూ. 1,745తో పాటు రూ. 49 డెలివ‌రీ ఛార్జీలు అద‌నం. అయితే అధికారిక అమ్మ‌కాల్లో ఉన్న స‌దుపాయాలు అమెజాన్‌లో కొన‌డం వ‌ల్ల అందుబాటులో ఉంటాయో లేదోన‌న్న అనుమానంతో వినియోగ‌దారులు ఈ ఫోన్‌ను కొనలా? వ‌ద్దా? అనే సందిగ్ధంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే అధికారిక జియో ఫీచ‌ర్ ఫోన్ల అమ్మ‌కాల‌ను జియో చేప‌ట్టనున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి వ‌ర‌కు ఎదురుచూసి అధికారిక అమ్మ‌కాల్లో కొన‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

More Telugu News