Chiranjeevi: 'సైరా' గురించి ఊపందుకున్న ఊహాగానాలు!

  • 'సైరా' కోసం గెడ్డం పెంచిన చిరూ 
  • తాజాగా గెడ్డం లేకుండగా కనిపించిన చిరూ 
  • అందరిలోనూ ఆశ్చర్యం .. అనేక సందేహాలు

'సైరా' సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని ఊహాగానాలు వినిపిస్తూనే వున్నాయి. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ పూర్తయిన తరువాత నుంచి చిరంజీవి కాస్త అసంతృప్తిగా ఉన్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. రెండవ షెడ్యూల్ వెంటనే మొదలుకాకపోవడానికి కారణం ఇదేనని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి గెడ్డం తీసేయడం, ఊహాగానాలకు మరింత ఊపునిచ్చింది.

 'సైరా'లోని పాత్ర కోసం చిరంజీవి గెడ్డం పెంచుతూ వచ్చారు. గుబురు గెడ్డమే ఆ పాత్ర లుక్ లో ప్రధానం. ఆ లుక్ కోసం పెంచిన గెడ్డం తీసేసి తాజాగా ఆయన కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏదైనా కారణంగా తాత్కాలికంగా ఈ సినిమా షూటింగును నిలిపేశారా? అనే సందేహాలే ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. ఫిల్మ్ నగర్లో జోరుగా జరుగుతోన్న ఈ ప్రచారంపై ఈ సినిమా టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.       

More Telugu News