China: అమెరికాను సవాల్ చేసేందుకు హిందూ మహాసముద్ర అంతర్భాగంలో బలపడుతున్న చైనా!

  • సరికొత్త నిఘా వ్యవస్థ, నెట్ వర్క్ అభివృద్ధి
  • సబ్ మెరైన్ లకు మద్దతుగా ఉండటమే లక్ష్యం
  • నౌకల గురించి మరింత కచ్ఛితమైన సమాచారం

హిందూ మహాసముద్రంతో పాటు, దక్షిణ చైనా సముద్ర అంతర్భాగాల్లో బలపడటమే లక్ష్యంగా చైనా, సరికొత్త నిఘా వ్యవస్థ, నెట్ వర్క్ లను అభివృద్ధి చేస్తోంది. చైనా మీడియా కథనాల ప్రకారం, సబ్ మెరైన్ లకు మద్దతుగా నిలిచేలా మారీటైమ్ సిల్క్ రోడ్ ను చైనా నిర్మిస్తోందని తెలుస్తోంది. నీటి అంతర్భాగంలో పర్యావరణ పరిరక్షణ, ముఖ్యంగా నీటి ఉష్ణోగ్రత, లవణాలు తదితరాలను పరిశీలించేందుకు ఈ వ్యవస్థను నిర్మిస్తున్నట్టు చెప్పినప్పటికీ, లక్షిత నౌకలను మరిత కచ్ఛితత్వంతో టార్గెట్ చేసేలా నావిగేషన్, పొజిషనింగ్ వ్యవస్థను బలోపేతం చేసుకుందని తెలుస్తోంది.

సౌత్ చైనా సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనాలజీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారని, ఈ ప్రాజెక్టుతో మహా సముద్రాల విషయంలో అమెరికాను సవాల్ చేసే స్థాయికి చైనా చేరుకోనుందని 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' పేర్కొంది. చైనా తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఇప్పటికీ సుదూరంగానే ఉన్నట్టు భావించాలని వ్యాఖ్యానించింది. ఆకాశంలో ఉండే శాటిలైట్లు, నీటిలోపల నిలిపే గ్లైడర్స్ డేటాను విశ్లేషించి, నీటిపై ఉండే నౌకలు తదితరాల గురించిన సమాచారాన్ని అందిస్తుంటాయని ఓషనాలజీ ఇనిస్టిట్యూట్ తన నివేదికలో పేర్కొంది.

More Telugu News