aimplb: ట్రిపుల్ తలాక్ ర‌ద్దు నేప‌థ్యంలో స్టాలిన్‌ను క‌లిసిన అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు!

  • కేంద్ర ప్ర‌భుత్వం తొందరపాటుతో వ్యవహరించిందని ఇటీవ‌ల స్టాలిన్ వ్యాఖ్య‌
  • ట్రిపుల్ త‌లాక్ బిల్లును స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు పంపాలని డిమాండ్‌
  • స్టాలిన్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన ఏఐఎంపీఎల్‌బీ

ముస్లిం మ‌హిళ‌ల జీవితాలను నాశనం చేస్తోన్న ట్రిపుల్‌ తలాక్ విధానం నిషేధపు బిల్లును ఇటీవల లోక్‌స‌భ‌ ఆమోదించిన విష‌యం తెలిసిందే. ఈ బిల్లుపై త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష డీఎంకే నేత స్టాలిన్ తాజాగా మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తొందరపాటుతో వ్యవహరించిందని, దీన్ని స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు పంపాలని డిమాండ్‌ చేశారు. ఈ నేప‌థ్యంలో అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) స్టాలిన్‌ను క‌లిసి ధ‌న్య‌వాదాలు తెలిపింది. సజ్జద్‌ నొమానీ ఆధ్వ‌ర్యంలో ఏఐఎంపీఎల్‌బీ కార్యవర్గ సభ్యులు స్టాలిన్‌ నివాసానికి వ‌చ్చి కాసేపు మాట్లాడారు. 

  • Loading...

More Telugu News