restaurants: కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించిన రెస్టారెంట్లు!

  • ముంబై ప్రమాదం నేపథ్యంలో నిర్ణయం
  • ఎగ్జాస్టివ్ నిబంధనలు అనుసరించకుంటే సంఘం నుంచి వెలి
  • స్వీయ నియంత్రణకు ముందుకొచ్చిన జాతీయ రెస్టారెంట్ల సంఘం

ముంబైలోని ఓ రెస్టారెంట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం నేపథ్యంలో కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని రెస్టారెంట్ల జాతీయ సంఘం (ఎన్ఆర్ఏఐ) నిర్ణయించింది. ఇందుకోసం తమంతట తామే ఓ నియంత్రణ విధానాన్ని అమలు చేయాలని కూడా నిర్ణయించింది. దీంతో ఈ సంఘంలో నమోదై ఉన్న 5,500 రెస్టారెంట్లు ఇకపై భద్రతా చర్యలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.

 ముంబైలోని ఓ రూఫ్ టాప్ రెస్టారెంట్లో గత శుక్రవారం మంటలు చెలరేగి 14 మంది మృత్యువాత పడిన విషయం విదితమే. ఇకపై ఎగ్జాస్టివ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, లేదంటే ఆయా రెస్టారెంట్లను ఎన్ఆర్ఏఐ నుంచి తొలగించడం జరుగుతుందని సంఘం అధ్యక్షుడు రాహుల్ సింగ్ తెలిపారు. ఈ నిబంధనను అమలు చేస్తుందీ, లేనిదీ తెలుసుకునేందుకు ఓ ఏజెన్సీతో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. మూడింట రెండొంతులు రెస్టారెంట్ పరిశ్రమ అవ్యవస్థీకృత రంగంలోనే ఉండగా, దీని వల్లే నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News