pavan: మెగా ఫ్యామిలీ కోసం 'అజ్ఞాతవాసి' స్పెషల్ షో!

  • పవన్ సాంగ్ కి పెరుగుతోన్న లైక్స్ 
  • సినిమాపై పెరుగుతోన్న అంచనాలు 
  • జనవరి 10న భారీ విడుదల    

పవన్ కల్యాణ్ తాజా చిత్రంగా రూపొందిన 'అజ్ఞాతవాసి' .. ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖుల కోసం ఈ సినిమా స్పెషల్ షో వేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారట.

 విడుదలకి రెండు రోజుల ముందు స్పెషల్ షో వేయాలని భావించి ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మెగా ఫ్యామిలీతో పాటు, మిగతా మెగా హీరోలంతా కూడా ఈ స్పెషల్ షోకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా వదిలిన పవన్ పాట .. దుమ్ము లేపేస్తూ దూసుకుపోతుండటంతో, ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.  

More Telugu News