Hyderabad: హాస్టల్ లోని అమ్మాయిలు బయటకు రావాలంటూ వీరంగమాడిన పోకిరీలు... వీడియో చూడండి!

  • హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో ఘటన
  • బైకులపై విన్యాసాలు చేస్తూ అమ్మాయిల కోసం రభస
  • తమతో పార్టీకి వస్తామని చెప్పి రాలేదన్న కోపంతో నానా యాగీ
  • వీడియో తీసిన స్థానికులు
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ, కొందరు పోకిరీలు హైదరాబాద్ పరిధిలోని దిల్ సుఖ్ నగర్ లో వీరంగం సృష్టించారు. రోడ్డుపై ఉన్న అమ్మాయిల హాస్టల్ ముందు నానా రభసా చేశారు. పదుల సంఖ్యలో వచ్చిన యువకులు, తమ తమ బైకులపై విన్యాసాలు చేస్తూ, అమ్మాయిలు బయటకు రావాలని కేకలు పెడుతూ, హాస్టల్ పై రాళ్లు రువ్వారు. తమతో న్యూ ఇయర్ పార్టీకి వస్తామని చెప్పిన కొందరు అమ్మాయిలు, హ్యాండిచ్చారని వారి పేర్లు చెబుతూ నానా రభసా చేశారు.

ఇంతలో హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసు పెట్రోలింగ్ వాహనాలు వచ్చేసరికి యువకులు పరారయ్యారు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీయడం గమనార్హం. ఈ హాస్టల్ వద్ద నిత్యమూ అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కబుర్లాడుకుంటూ కనిపిస్తుంటారని, రాత్రుళ్లు అబ్బాయిలు ఇక్కడ చేరి గొడవ చేయడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Hyderabad
Dilsukhnagar
Ladies Hostel

More Telugu News