Flip Kart: కొత్త సంవత్సరంలో ఫ్లిప్ కార్ట్ తొలి డీల్స్... మొబైల్ బొనాంజా!

  • కొత్త డీల్స్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్
  • పలు స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరలు
  • రూ. 20 వేలకు పైగా తగ్గిన గూగుల్ పిక్సెల్ ధర
నూతన సంవత్సరం శుభవేళ, ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ పలు కొత్త డీల్స్ ప్రకటించింది. ఆకర్షణీయ ఆఫర్లతో కూడిన మొబైల్ బొనాంజాను ప్రకటించింది. షియోమీ ఎంఐ ఏ1, గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ ఎల్, మోటో జీ5 ప్లస్, రెడ్ మీ నోట్ 4, లెనోవో కే5 నోట్, శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై ప్రత్యేక తగ్గింపును అందిస్తున్నట్టు తెలిపింది. పలు 4జీ స్మార్ట్ ఫోన్లను చౌకధరలకు అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపింది.

తమ వద్ద కొనుగోలు చేసిన ఫోన్లకు బై బ్యాక్ గ్యారెంటీతో పాటు రూ. 833 నెలకు చెల్లింపుతో సులభ ఈఎంఐ ఆప్షన్స్ ఇస్తున్నామని పేర్కొంది. రూ. 13,999 ధర ఉన్న ఎంఐ ఏ1 ను రూ. 12,999కి అందిస్తామని, రూ. 61 వేల ధర ఉన్న గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ ఎల్ రూ. 39,999కి లభ్యమవుతుందని, హెచ్డీఎఫ్సీ కార్డుపై కొనుగోలు చేస్తే, మరో రూ. 8 వేల రాయితీ లభిస్తుందని తెలిపింది. రూ. 16 వేల ఖరీదైన మోటో జీ5 ప్లస్ ను రూ. 9,999కి అందిస్తామని, రూ. 13,499 ధర ఉన్న లెనోవో కే5 నోట్ రూ. 11,481కి లభ్యమవుతుందని తెలిపింది. మరిన్ని వివరాలను, ఇతర ఆఫర్లను తమ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.
Flip Kart
Google Pixel
Discounts

More Telugu News