Anchor Pradeep: బ్రీత్ అనలైజర్ పరీక్షలో యాంకర్ ప్రదీప్ కు 178 పాయింట్లు... జైలు శిక్ష తప్పదా?

  • మారిన నిబంధనలు చాలా కఠినం
  • దాదాపు హాఫ్ బాటిల్ తాగిన ప్రదీప్ 
  • 100 పాయింట్లు తాగితే జైలు తప్పదంటున్న అధికారులు

గత రాత్రి పూటుగా మద్యం తాగి, పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన యాంకర్ ప్రదీప్ కు, ప్రస్తుత డ్రంకెన్ డ్రైవ్ నిబంధనల ప్రకారం జైలు శిక్ష తప్పదని తెలుస్తోంది. సాధారణంగా డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి బ్రీత్ అనలైజర్ టెస్టులో 35 పాయింట్లు దాటితే, వాహనం సీజ్, శిక్ష తప్పదు. ఇక గత రాత్రి ప్రదీప్ కు 178 పాయింట్లు వచ్చాయి. అంటే, ఇది చాలా అధికమనే చెప్పవచ్చు.

సాధారణంగా ఒక పెగ్గు తాగితే 30 నుంచి 32 పాయింట్ల వరకూ బ్రీత్ అనలైజర్ టెస్ట్ రిజల్ట్ చూపుతుంది. ఇక ప్రదీప్ కు 178 పాయింట్లు వచ్చాయంటే, కనీసం హాఫ్ బాటిల్ వరకూ తాగుండాలి. ఇప్పటి నిబంధనల ప్రకారం, 100 పాయింట్లు దాటి పట్టుబడితే, రెండు రోజుల నుంచి వారం రోజుల జైలు శిక్ష విధిస్తున్నారు. దీనికి కూడా వ్యక్తి హోదా, నడుపుతున్న వాహనం, ఎన్నోసారి పట్టుబడ్డాడన్న విషయాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది.

ఈ మేరకు ఇప్పటికే నిబంధనలను సవరించిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలను అనుసరించి ప్రదీప్ కు జైలు శిక్ష తప్పదని పోలీసు వర్గాలు అంటున్నాయి. గత రాత్రి ఆయన వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు, మంగళవారం నాడు కౌన్సెలింగ్ కు, కోర్టుకు హాజరయ్యేందుకు రావాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News