All uarjun: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • నేటి సాయంత్రం 'నా పేరు సూర్య' ఫస్ట్ ఇంపాక్ట్ 
  • 'అడవి రాముడు'గా రానా దగ్గుబాటి 
  • 'ఆనందో బ్రహ్మ' దర్శకుడి '70 ఎం.ఎం' 
  • 'దేశదిమ్మరి'గా వస్తున్న యువ నటుడు  

*  అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'నా పేరు సూర్య' చిత్రం 'ఫస్ట్ ఇంపాక్ట్'ను నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు రిలీజ్ చేస్తున్నారు. నేటి సాయంత్రం 5 గంటలకు దీనిని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
*  తమిళ దర్శకుడు ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ చిత్రం రూపొందుతోంది. హిందీలో ఈ చిత్రానికి 'హాథీ మేరే సాథి' అనే టైటిల్ ని గతంలోనే ఫిక్స్ చేశారు. కాగా, తెలుగు వెర్షన్ కి తాజాగా 'అడవి రాముడు' అనే టైటిల్ని నిర్ణయిస్తూ, ఫిలిం చాంబర్ లో దానిని రిజిస్టర్ చేశారు.  
*  గత సంవత్సరం 'ఆనందో బ్రహ్మ' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు మహి వి. రాఘవ్ తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించాడు. ఈ చిత్రం పేరు '70 ఎం.ఎం'. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ చిత్రాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.  
*  యువ కథానాయకుడు తనీష్ నటిస్తున్న తాజా చిత్రం 'దేశదిమ్మరి'. నగేష్ నారదాశి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నట్టు నిర్మాత తెలిపారు.  

  • Loading...

More Telugu News