agnatavasi: పవన్ పాడిన ‘కొడకా కోటేశ్వరరావు..’ పాట విడుదల!

  • ‘అజ్ఞాతవాసి’ చిత్రంలోని ఆరో పాట విడుదల
  • హుషారుగా ‘కొడకా.. కొడకా.. కొడకా కోటేశ్వరరావు కరుసై పోతవురో..’ పాట
  • ‘యూ ట్యూబ్’ ద్వారా పాట విడుదల చేసిన చిత్రయూనిట్

‘అజ్ఞాతవాసి’ చిత్రంలోని ఐదు పాటల ఆడియో ఇప్పటికే విడుదలైంది. ఈ చిత్రంలో ఆరో పాట ‘కొడకా కోటేశ్వరరావు’ ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా పాడారు. ఈ పాటను కొత్త సంవత్సరం కానుకగా డిసెంబరు 31వ తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

అన్నట్టుగానే కొన్ని నిమిషాల క్రితం ఈ పాటకు సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘కొడకా.. కొడకా.. కొడకా కోటేశ్వరరావు కరుసై పోతవురో..’అంటూ ఎంతో హుషారుగా పవన్ పాడారు. ఈ వీడియోలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు అనిరుథ్, పాటల రచయిత భాస్కరభట్ల తదితరులు ఉన్నారు. పవన్ ఈ పాట పడే దృశ్యంతో పాటు ఈ పాటను చిత్రీకరించిన సన్నివేశాలను పొందుపరిచారు.


More Telugu News