crpf: సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంపై ‘ఉగ్ర’ దాడి.. నలుగురు జవాన్ల మృతి

  • పుల్వామా జిల్లాలోని లెత్ పొరలో దారుణం
  • గ్రెనేడ్లు విసురుతూ శిక్షణాకేంద్రంలోకి చొరబడే యత్నం
  • దీటుగా స్పందించిన భద్రతా బలగాలు
  • ముగ్గురు ఉగ్రవాదుల హతం

దక్షిణ కాశ్మీర్ లోని సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పుల్వామా జిల్లా లెత్ పొరలో ఈరోజు తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్టు సమాచారం. ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసురుతూ, శిక్షణ కేంద్రంలోకి చొరబడేందుకు యత్నించారు. దీనికి దీటుగా స్పందించిన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.

కాగా, ఈ సంఘటనకు పాల్పడింది తామేనంటూ నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది. ఇదిలా ఉండగా, జైషే మహ్మద్ కమాండర్ నూర్ మొహమ్మద్ ను భద్రతా బలగాలు ఇటీవల మట్టుబెట్టాయి. ఇందుకు ప్రతీకారంగానే సీఆర్పీఎఫ్ శిక్షణా శిబిరంపై వారు దాడికి పాల్పడ్డట్లు సమాచారం.

  • Loading...

More Telugu News