alahabad: అదుపు తప్పిన కాన్వాయ్.. కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ కు గాయాలు!

  • ఓ బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రమాదం
  • అలహాబాద్ సమీపంలో చోటుచేసుకున్న సంఘటన
  • అనుప్రియా పటేల్ ను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స
కాన్వాయ్ అదుపు తప్పిన సంఘటనలో కేంద్ర కుటుంబ సంక్షేమం, ఆరోగ్య శాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్ సహా ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. అలహాబాద్ సమీపంలో మంత్రి కాన్వాయ్ లోని వాహనాలు అదుపు తప్పి ఒకదానినొకటి ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో మంత్రి ప్రయాణిస్తున్న కారును వెనుక వాహనాలు ఢీ కొట్టాయి. దీంతో, స్వల్పంగా గాయపడిన అనుప్రియా పటేల్ ను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, కొరాన్ గ్రామంలో ఓ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆమె వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
alahabad
convoy

More Telugu News