akhada parishad: ఫేక్ బాబాల రెండో లిస్ట్ విడుదల చేసిన అఖాడా పరిషత్

  • రెండో జాబితాలో ముగ్గురు దొంగబాబాలు
  • సెప్టెంబర్ లో తొలి జాబితా
  • రెండో జాబితాలో సచ్చిదానంద సరస్వతి

దేశంలో ప్రజలను మోసం చేస్తున్న ఫేక్ బాబాల రెండో జాబితాను అఖిల భారతీయ అఖాడా పరిషత్ విడుదల చేసింది. కొత్త జాబితాలో వీరేంద్ర దేవ్ దీక్షిత్ (ఢిల్లీ), సచ్చిదానంద సరస్వతి (బస్తి, యూపీ), త్రికాల్ భావంత్ (అలహాబాద్)లు ఉన్నారు. వీరితో కలిపి అఖాడా పరిషత్ ప్రకటించిన ఫేక్ బాబాల సంఖ్య 17కు చేరుకుంది. హిందూ సాధువుల అపెక్స్ బాడీ అయిన అఖాడా పరిషత్ ఫేక్ బాబాల తొలి జాబితాను సెప్టెంబర్ లో విడుదల చేసింది. ఈ జాబితాలో 14 మంది ఫేక్ బాబాల పేర్లను పేర్కొంది.

అఖాడా పరిషత్ ప్రకటించిన ఫేక్ బాబాలు వీరే...
వీరేంద్ర దేవ్ దీక్షిత్, సచ్చిదానంద సరస్వతి, త్రికాల్ భావంత్, ఆశారాం బాపు, రాధే మా, సచ్చిదానంద గిరి, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, స్వామి ఓంజీ, నిర్మల్ బాబా, ఇచ్చధారి భీమానంద్, స్వామి అసీమానంద, నారాయణ సాయి, రాంపాల్, ఆచార్య కుష్ ముని, బృహస్పతి గిరి, ఓం నమ: శివాయ బాబా, మల్కన్ సింగ్. 

More Telugu News