tatkal tickets: సాఫ్ట్ వేర్ సాయంతో రైల్వే తత్కాల్ టికెట్ల బుకింగ్ హైజాక్... సీబీఐ దర్యాప్తు

  • ఆన్ లైన్లో అందుబాటులో ఎన్నో సాఫ్ట్ వేర్లు 
  • ఏక కాలంలో ఎన్నో టికెట్లు బుక్ చేసుకోవచ్చు
  • ట్రావెల్ ఏజెంట్ల అక్రమాలు

రైల్వే తత్కాల్ టికెట్లను సాఫ్ట్ వేర్ల సాయంతో కొందరు ట్రావెల్ ఏంజెట్లు చాలా వేగంగా బుక్ చేసుకునిపోతున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఇప్పుడు ఈ అంశంపైనే దృష్టి సారించింది. ఆన్ లైన్ లో ఈ తరహా సాఫ్ట్ వేర్లు చాలానే విక్రయానికి ఉన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం తాము వీటిని పరిశీలిస్తున్నట్టు, చట్టవిరుద్ధమని తేలితే త్వరలోనే వాటిపై చర్యలు తీసుకోనున్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు.

ఈ నకిలీ సాఫ్ట్ వేర్ ఉంటే ప్రయాణికుల వివరాలను పనిగట్టుకుని కీబోర్డుపై టైప్ చేయక్కర్లేదు. సాఫ్ట్ వేర్ వేగంగా ఆయా కాలమ్స్ లో క్షణంలో వివరాలను నింపేస్తుంది. తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రారంభానికి ముందే ఈ వివరాలను సాఫ్ట్ వేర్ల సాయంతో సిద్ధంగా ఉంచుతారు. బుకింగ్ మొదలైన వెంటనే ఒకటికి మించిన ఐడీలతో లాగిన్ అవ్వడం దగ్గర్నుంచి, ప్రయాణికుల వివరాల నమోదు, బుకింగ్ వరకు సాఫ్ట్ వేర్ వేగంగా పని చేసేస్తుంది. ఒకే క్లిక్ తో చాలా వరకు టికెట్లను ఏకకాలంలో బుక్ చేసుకోవచ్చని దర్యాప్తు అధికారులు తెలిపారు.

More Telugu News