up: మదర్సాలో లైంగిక వేధింపులు... 51 మంది బాలికలకు విముక్తి

  • మదర్సాలో 126 మంది బాలికలు
  • లైంగిక వేధింపులపై ఏడుగురు ఫిర్యాదు
  • మదర్సా కన్వీనర్ పై కేసు నమోదు
ఉత్తరప్రదేశ్  రాజధాని లక్నోలోని ఓ మదర్సాలో లైంగిక వేధింపుల బారి నుంచి 51 మంది బాలికలకు పోలీసులు విముక్తి కల్పించారు. విద్యా సంస్థ కన్వీనర్ తయ్యబ్ జియా తనపై అత్యాచారం చేయడంతోపాటు, హింసకు గురిచేసినట్టు ఓ విద్యార్థిని శనివారం పిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మదర్సాపై దాడులు నిర్వహించారు.

యూపీలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 126 మంది బాలికలు ఇక్కడ ఉండగా, వీరిలో ఏడుగురు బాలికలు కన్వీనర్ కు వ్యతిరేకంగా లైంగిక వేధింపులు, అత్యాచారయత్నంపై ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు జియాపై వేధింపులు, అత్యాచార యత్నం, పోస్కోలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
up
madarsa
molestation
girls

More Telugu News