trisha: స్వయంగా మరుగుదొడ్డి కట్టిన నటి త్రిష!

  • యూనిసెఫ్ ఇండియా కార్యక్రమంలో త్రిష
  • గోడను నిర్మించిన నటి
  • కాంచీపురం జిల్లాలో కార్యక్రమం

సినీ నటి త్రిషకు సామాజిక స్పృహ చాలా ఎక్కువ. సినిమాలలో బిజీగా ఉన్నా, సమాజం కోసం తన వంతు చేయడానికి ఆమె ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. జంతు హక్కుల కోసం పోరాడుతున్న ఆమె, పెటా సభ్యురాలిగా ఉన్నారు. తాజాగా బిజీ షెడ్యూల్ కు విరామం ప్రకటించి, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంది. తమిళనాడులోని కాంచీపురం జిల్లా నెమలి గ్రామంలో మరుగుదొడ్లను నిర్మించేందుకు తన వంతు సాయం చేసింది త్రిష.

ఇందులో భాగంగా ఆ గ్రామానికి వెళ్లిన త్రిష మరుగుదొడ్లను నిర్మించే కార్యక్రమంలో పాలుపంచుకుంది. ఇసుక, సిమెంట్ ను తానే కలిపి, ఇటుకలతో కొంచెం గోడను నిర్మించింది. యూనిసెఫ్ ఇండియాకు కూడా త్రిష బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించి శానిటేషన్ ప్రోగ్రామ్ లో ఆమె భాగస్వామి అయింది. సురక్షిత పరిసరాలకు సంబంధించి ఆమె ప్రచారం చేస్తోంది. త్రిష చేస్తున్న పనులకు జనాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

  • Loading...

More Telugu News