Rajinikanth: రజనీకాంత్ రాజకీయ ప్రకటనపై సుబ్రహ్మణ్యస్వామి సెటైర్లు!

  • రజనీ నిరక్షరాస్యుడు
  • మీడియా పెద్దది చేసి చూపుతోంది
  • పార్టీ వివరాలను రజనీ ప్రకటించలేదు

తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రజనీ ప్రకటనపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు మాత్రమే రజనీ ప్రకటన చేశారని... దీనికి సంబంధించిన వివరాలను, డాక్యుమెంట్లను మాత్రం ఆయన వెల్లడించలేదని స్వామి సెటైర్ వేశారు.

రజనీకాంత్ ఒక నిరక్షరాస్యుడని... మీడియా మాత్రం ఆయనను పెద్దగా చేసి చూపుతోందని అన్నారు. మరోవైపు, తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని రజనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందే తమ పార్టీ క్రియాశీలకంగా పని చేస్తుందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News