dgp sambasiva rao: ఏపీ డీజీపీ సాంబశివరావుకు ఘనంగా వీడ్కోలు

  • 6వ బెటాలియన్ లో వీడ్కోలు కార్యక్రమం
  • పోలీసు వందనం స్వీకరించిన సాంబశివరావు
  • నేడు పదవీ విరమణ చేయనున్న డీజీపీ

ఏపీ డీజీపీ సాంబశివరావుకు వీడ్కోలు పలికారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లో జరిగిన కార్యక్రమంలో పోలీసు దళాలు ఘనంగా వీడ్కోలు పలికాయి. ఈ సందర్భంగా జరిగిన పరేడ్ లో పోలీసుల గౌరవ వందనాన్ని సాంబశివరావు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి నూతన డీజీపీ మాలకొండయ్యతో పాటు పలువురు పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈరోజు సాంబశివరావు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా, సాంబశివరావు కార్యదక్షతను పోలీసు అధికారులు, సిబ్బంది కొనియాడారు.

More Telugu News