రాజకీయాల్లోకి వస్తున్నా... మొత్తం 234 స్థానాల్లో పోటీ: రజనీకాంత్ సంచలన ప్రకటన
- రాజకీయ అరంగేట్రంపై రజనీ కీలక ప్రకటన
- యుద్ధం చేస్తున్నా
- గెలుపు, ఓటమిలను నిర్ణయించేది భగవంతుడే
రాజకీయాల్లో గెలిస్తే విజయమని... లేదంటే విరమణ అని చెప్పారు. కాలమే తన రాజకీయ అరంగేట్రాన్ని నిర్ణయించిందని అన్నారు. అభిమానులతో సూపర్ స్టార్ రజనీకాంత్ సమావేశం చివరి రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, రాజకీయ అరంగేట్రంపై కీలక ప్రకటన చేశారు. రజనీ ప్రకటనతో చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణమంటప ప్రాంగణం అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోయింది.