Tamilnadu: ట్రక్‌పై మొబైల్‌ ఫుడ్‌ బిజినెస్ చేస్తోన్న మహిళ.. పెట్టుబడి పెడతానని ఆఫర్ ఇచ్చిన మహీంద్రా గ్రూప్స్‌ ఛైర్మన్‌

  • కర్ణాటకలోని మంగళూరుకు చెందిన శిల్ప
  • ఆమె చేస్తోన్న బిజినెస్‌పై ఇటీవల మీడియాలో కథనాలు
  • స్పందిస్తూ సాయం అందిస్తానన్న మహీంద్రా గ్రూప్స్ ఛైర్మన్
  • రెండో అవుట్‌లెట్‌ పెట్టాలనుకుంటోన్న మహిళ
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన శిల్ప అనే 34 ఏళ్ల మహిళ.. మహిళా సాధికారతను చాటుతోంది. మహీంద్రా బొలెరో బ్రాండ్ ట్రక్‌పై మొబైల్‌ ఫుడ్‌ బిజినెస్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమె చేస్తోన్న కృషిని ప్రశంసిస్తూ ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమె గురించి తెలుసుకున్న మహీంద్రా గ్రూప్స్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ఆమె చేస్తోన్న వ్యాపారంలో తాను పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమని ప్రకటించారు.

ఆమె తన సోదరుడికి కూడా సాయం చేసేందుకు రెండో అవుట్‌లెట్‌ను పెట్టాలనుకుందని తెలుసుకున్నానని ఆయన తెలిపారు. ఆమెకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. ఆమె రెండో అవుట్‌లెట్‌ ప్రారంభించేందుకు పెట్టుబడి పెడతానని, ఈ విషయాన్ని ఆమెకు ఎవరైనా తెలియజేయండని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కాగా, హసన్‌ ప్రాంతానికి చెందిన శిల్ప తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. ఆమెకు పెళ్లి జరిగినప్పటికీ 2008లో ఆమె భర్త కనిపించకుండా పోవడంతో ఎవ్వరి మీదా ఆధారపడకుండా ఆమె ఈ బిజినెస్ చేసుకుంటోంది. 
Tamilnadu
outlet
mobile truck food
business

More Telugu News