nikhil: నిఖిల్ విన్న కథే చిరూ చిన్నల్లుడికి నచ్చిందట!

  • నిఖిల్ కి కథ చెప్పిన రాకేశ్ శశి 
  • తనకి సెట్ కాదన్న నిఖిల్ 
  • ఆ కథకి ఓకే చెప్పిన చిరూ చిన్నల్లుడు
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమవుతోందనే వార్త కొంత కాలంగా షికారు చేస్తోంది. చిరూ .. చరణ్ సపోర్ట్ చేయడంతో కల్యాణ్ కొంతకాలంగా నటనలో శిక్షణ పొందుతూ వస్తున్నాడు. అలాగే డాన్స్ .. ఫైట్స్ విషయంలోను ఆయన శిక్షణ తీసుకుంటున్నాడు. రీసెంట్ గా ఆయనకి ఒక కథ నచ్చిందనీ .. ఆ కథ చిరంజీవి వినవలసి ఉందని అంటున్నారు.

అయితే దర్శకుడు రాకేశ్ శశి ముందుగా ఈ కథను హీరో నిఖిల్ కి వినిపించాడట. ఈ కథలోని తండ్రీకొడుకుల సెంటిమెంట్ తనకి చాలా బాగా నచ్చిందని చెప్పిన నిఖిల్, తనకి ఈ కథ అంతగా సెట్ కాదని చెప్పాడట. ఆ తరువాతనే కల్యాణ్ కి ఆ దర్శకుడు కథ వినిపించడం .. ఆయన నచ్చేసిందని చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. 'సైరా' పనుల్లో బిజీగా వున్న చిరంజీవి ఒకసారి ఈ కథ వినేసి ఓకే చెప్పేస్తే, సెట్స్ పైకి వెళ్లడానికి పెద్దగా సమయం తీసుకోరని సమాచారం.   
nikhil
kalyan

More Telugu News