Jayalalita: నేడు తెరచుకోనున్న జయలలిత సీక్రెట్ గదులు... ఏముందో తేల్చనున్న ఐటీ అధికారులు!

  • కీలక దశకు ఐటీ దాడులు
  • జయ ఆంతరంగిక గదులను తెరవనున్న అధికారులు
  • భారీ ఎత్తున చేరుకున్న అన్నాడీఎంకే శ్రేణులు
తమిళనాడులో శశికళ, ఆమె బంధువర్గమే లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులు కీలక దశకు చేరుకున్నాయి. పోయిస్ గార్డెన్స్ లోని వేదనిలయంలో జయలలిత పర్సనల్ గదిని నేడు తెరిచి, అందులో ఏముందో తేల్చాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ ఉదయం ఆమె ఇంటికి అధికారులు చేరుకోగా, ఆమె మాత్రమే వాడిన గదిలో ఏం దాచారన్న విషయాన్ని తెలుసుకునేందుకు భారీ ఎత్తున అన్నాడీఎంకే శ్రేణులు కూడా అక్కడకు చేరుకున్నాయి.

 ఇప్పటివరకూ చిన్నమ్మ సామ్రాజ్యంపై విరుచుకుపడిన ఐటీ, ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఏం దాచుకుందో తేల్చనున్నారు. గతంలో వేదనిలయంలో సోదాలు జరిపినప్పుడు జయ ఆంతరంగిక గదుల జోలికి వెళ్లలేదన్న సంగతి తెలిసిందే. ఇక ఆమె గదిలో ఏముందన్న విషయం నేడు తేలనుంది.
Jayalalita
Sasikala
Chennai
IT Search

More Telugu News